టీయూడబ్ల్యూజే (ఐజెయూ) మహాసభను విజయవంతం చేయాలి – ప్రధాన కార్యదర్శి గడ్డమీది బాలరాజు
కూకట్ పల్లి (జనంసాక్షి): ఈ నెల 14న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో శామీర్పేట తూoకుంటలోని మొగుళ్ల వెంకట్ రెడ్డి గార్డెన్ లో మేడ్చల్..మల్కాజిగిరి జిల్లా ద్వితీయ మహాసభను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది బాలరాజు అన్నారు. సోమవారం కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శేషాదినగర్ కమిటీ హాల్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన బాలరాజు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రెస్ క్లబ్ సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే కార్యాచరణను 14న నిర్వహించే సమావేశంలో చేర్చించుకోవడంతో పాటుగా జిల్లా నూతన కమిటీ ఎన్నిక ఉంటుందన్నారు.నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సభ్యులు సహకరించాలన్నారు. ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా ఇప్పటికే ప్రతి నియోజకవర్గం ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యుల నుంచి ఆసక్తి కలిగిన ఐదు మంది సభ్యులకు జిల్లా కమిటీలో చోటు కల్పించే అవకాశాన్ని వినియూగించుకోవాలని ప్రతి ప్రెస్ క్లబ్ కమిటీ సబ్యులకు ఆదేశాలు పంపించమన్నారు. పెద్ద ఎత్తున సభ్యులు హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.అనంతరం రాష్ట్ర మఫ్సిల్ కమిటీ సభ్యులు మామిడాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి కట్టుగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవలన్నారు.కూకట్ పల్లి కి త్వరలోనే పక్కా ప్రెస్ క్లబ్ భవనాన్ని ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానన్నారు.అనంతరం కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎమ్.ఎ. కరీం మాట్లాడుతూ కమిటీ సభ్యుల సహకారంతో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడతానని అన్నారు. ముఖ్యంగా జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం కూకట్ పల్లి కి చెందిన ఆసుపత్రుల్లో 50 శాతం రాయితీలతో రిపోర్టర్ల కుటుంబాలకు వైద్యం అందించే సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.14 న ఉదయం 9 గంటలకు భాగ్యనగర్ కాలోని నుంచి శమీర్పెట్ లో జరిగే మహాసభకు బస్సు బయలుదేర నుందని ప్రతి ఒక్కరు తప్పక రావాలని పేర్కొన్నారు.కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎడ్ల రంజిత్ మాట్లాడుతూ జిల్లా కమిటీ అదేశాల మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో తీర్మానించుంకున్న ప్రతి అంశాన్ని కమిటీ సభ్యులందరి తరపున ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నామన్నారు. అనంతరం మహాసభకు సంబందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.కార్యక్రమంలో జిల్లా నాయకులు దామోదర్ రెడ్డి, నర్సింహా, నవీన్ రెడ్డి కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు వెంకట్రావు, సముద్రాల కిరణ్, ప్రవీణ్, నుతలపాటి శ్రీనివాస్ ,శ్రీనివాస్ రెడ్డి, నజీర్, మాణిక్య రెడ్డి, నామాల శ్రీధర్ గౌడ్, సతీష్, తిరుపతి, క్రాంతి, గంగరాజు,ఎల్లకొండ జయకుమార్ గుప్త, రాజు, రాము,శ్రీకాంత్,రాకేష్, వెంకటేష్,రామారావు, హరి, తదితరులు పాల్గొన్నారు.




