Tuesday, 3 November 2026

సినీ మహిళలను సత్కరించిన చిరు

తన విజయం వెనక సురేఖ పాత్ర ఎక్కువని వెల్లడి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మెగాస్టార్‌ చిరంజీవి తన బ్లడ్‌ బ్యాంక్‌ లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖతో సహా పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మహిళలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు చిరంజీవి . అలాగే తన భార్య సురేఖ గురించి, ఆవిడ వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ’కుటుంబంపై బాధ్యతలు తీసుకుంటున్న మహిళలకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు స్త్రీలు ఇంటిపట్టునే ఉండకుండా.. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. అందుకు మనమెంతో గర్వించాలి. అలా వాళ్లు ఎదగడానికి మన వంతు సహకారం కూడా అందించాలి. నేను సక్సెస్‌ ఫుల్‌ హీరోగా మారడానికి నా భార్య సురేఖనే కారణం. మా కుటుంబ బాధ్యతల్ని సురేఖ తీసుకుంది. ఆమె అండగా నిలవడంతోనే ధైర్యంగా సినిమాలు చేశాను. ఇంట్లో వారి గురించి సురేఖ ఎప్పుడూ ఆలోచిస్తుంది. కోట్లాది రూపాయల భూమిని అందరికీ పంచాలని కోరింది’.. అంటూ చిరంజీవి ఆవిడపై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి తన చారిటిబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సినీ పరిశ్రమకు చెందిన మహిళలను సత్కరించాడు. ఈ క్రమంలో స్త్రీల గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు. మహిళల పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఏర్పడడానికి తన భార్య సురేఖ ప్రోత్సాహం ఉందన్నారు. తన విజయం వెనకా ఆమె ఉందన్నారు. ఇక ఏపి టిక్కెట్ల పెంపు జీవోపై మాట్లడడానికి చిరంజీవి నిరాకరించాడు. ’సినిమా టికెట్ల జీవోపై ఇప్పుడు మాట్లాడను.. ఇది సందర్భం కాదని పేర్కొన్నాడు. అంతే కాకుండా ఇప్పుడు ’నేను ఏది మాట్లాడినా అది కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉందన్నారు. జీవో గురించి అవసరమైతే ప్రత్యేకంగా మాట్లాడుతానని చెప్పారు. తాజాగానే టికెట్‌ ధరల పెంపు జీవోపై చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా ’తెలుగు సినీ పరిశ్రమకు మేలు కలిగే విధంగా అటు థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ జీవోజారీచేసిన సీఎం వైఎస్‌ జగన్‌కు సినీ పరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చిన్న సినిమాకు ఐదో షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధింత శాఖ మంత్రి పేర్ని నాని, అధికారులు, కమిటీ సభ్యులకు ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశాడు.