Wednesday, 4 November 2026

ఐటిఐలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ

హత్నూర (జనం సాక్షి)
హత్నూర రెసిడెన్షియల్ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ప్రవేశానికి 3వ విడత దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ లు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ఐటిఐలలో మిగిలిన సీట్ల కోసం ఈ నెల 13 వ తేది నుండి 17 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు.హత్నూర ఐటిఐలో వెల్డర్,కోపా,మెకానిక్ మోటార్ వెహికల్,టర్నర్,మెషినిస్ట్, ఎలక్ట్రిషన్ ట్రేడ్లలో ఖాళీలు ఉన్నాయని వారు తెలిపారు.ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.