ఎల్బీ నగర్ (జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభపతి ,ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి జన్మదిన సందర్భంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు నారోజు జగ్జీవన్ చారి ఆధ్వర్యంలో గురువారం నాడు ఎల్బీ నగర్ లోని శ్రీకాంతాచారి చౌరస్తా వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్బంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు .ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులిగిల్ల శ్రీనివాసాచారి ,ఉద్యమ నాయకులు నెల్లోజు సాళ్వచారి .పెద్ద కొలిమి బ్రహ్మచారి , పర్వతం శ్రీనివాసాచారి నాగరాజు రామాచారి ,లక్ష్మీ రామాచారి ఆందోజు శ్రీనివాస దయానంద చారి ,యాదగిరాచార్య వెంకట చారి తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి విశ్వకర్మ జాతికి కి ఎనలేని సేవలు చేసిన ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి రానున్న రోజుల్లో మధుసూదనాచారి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఘనంగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి జన్మదిన వేడుకలు




