Wednesday, 4 November 2026

.మునుగోడు విశ్వకర్మ ముద్దుబిడ్డ ఆందోజు శంకరాచారిని భారీ మెజారిటీతో గెలిపించాలి :

భారత విశ్వకర్మ మహాసభ  రాష్ట్ర అధ్యక్షులు  కౌలే జగన్నాధం

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) తెలంగాణ రాష్ట్రంలోని  నల్లగొండ జిల్లాలో  మునుగోడు నియోజకవర్గం లో చండూరులో ఈరోజు  విశ్వకర్మ ముద్దుబిడ్డ బ్రహ్మశ్రీ ఆందోజు  శంకరాచారి  గారు బీఎస్పీ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ వినియోగించుకొని  నామినేషన్ వేయడం జరిగింది.  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ,ఈ కార్యక్రమంలో  హైదరాబాదు  నుండి  100 మందితో అఖిల భారత విశ్వకర్మ మహాసభ  రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ కౌలే  జగన్నాధం  ఆధ్వర్యంలో    వారి కమిటీ  సభ్యులతో అంగరంగ  వైభవంగా  ఆనందోత్సవాలతో  పాల్గొనడం జరిగింది. విశ్వకర్మ ముద్దుబిడ్డ  ఆందోజు శంకరాచారిని గెలిపించి మన జాతి ఐక్యతను ఈ ప్రభుత్వానికి చాటి చెప్పాలని కోరారు. మనము ఏ పార్టీలో పని చేసినా కానీ మునుగోడు లో మాత్రం శంకరాచారిని తప్పకుండా గెలిపించాలని, అఖిల భారత విశ్వకర్మ మహాసభ  రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ కౌలే జగన్నాధం పిలుపు నిచ్చారు      ,  ఈ కార్యక్రమంలో  గౌరవ అధ్యక్షులు చెన్నయ్య చారి , రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చారి , మహిళా అధికార  ప్రతినిధి సిద్ధాంతం శ్యామల , యువ  నాయకుడు కౌలే  అభిషేక్ అతిరధ మహారధులు, కళా కారులు, రచయతలు,పాల్గొనడం జరిగింది

Attachments area