Tuesday, 3 November 2026

ఐటీ కంపెనీలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా

హైదరాబాద్‌: ఐటీ కంపెనీలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలని డిస్కంలను సీఎం ఆదేశించినట్లు ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. సచివాలయంలో ఐటీ శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష ముగిసింది. అనంతరం పొన్నాల విలేకరులతో మాట్లాడుతూ ఐటీ విస్తరణకు దరఖాస్తు చేసుకున్న 12 సంస్థల భూకేటాయింపులకు ధరల నిర్ణయంపై కమిటీని నియమించనున్నట్లు  ఆయన చెప్పారు. సీఎన్‌ నేతృత్వంలో ఉన్నతాధికారులతో కమిటీకి సీఎం ఆమోదం తెలిపారని అన్నారు.ద్వితీయ, తృతీయ స్థాయి నగరాల్లో ఐటీ సంస్థల ఏర్పాటుకు  ముందుకొచ్చే వారికి రాయితీలు ఇవ్వనున్నట్లు  చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *