హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై నాగర్ కర్నూలు ఎంపీ మందా జగన్నాథం మండిపడ్డారు. సీఎంకు మానవత్వం ఉంటే శంకర్రావు అరెస్టు చేసిన తీరును చూసి స్పందించాలన్నారు. పోలీసుల ప్రవర్తనపై సీఎం సమాధానం చెప్పాలని మందా డిమాండ్ చేశారు. శంకర్రావు అరెస్టు వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.




