ఐపీఎల్‌-6 తొలి ప్లేఆఫ్‌ నేడు

ముంబయితో చెన్నై ఢీ

న్యూఢిల్లీ : ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ ఆరో సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. అంతిమ సమరంలో తలపడే జట్లను నిర్ణయించే ప్లేఆఫ్‌ దశకు నేడే శ్రీకారం! తొలి ఫైనలిస్టును తేల్చే క్వాలిఫయర్‌-లో రెండు అగ్ర జట్లు తలపడనున్నాయి. చెరో పదకొండు విజయాలతో ప్లేఆఫ్‌కు ఆర్హత సాధించిన టాఫ్‌-2 జట్లు ముంబయి ఇండియన్స్‌, చైన్నై సూపర్‌కింగ్స్‌ మంగళవారం ఢిల్లీలో తాడోపేడో తేల్చుకోనున్నాయి. లీగ్‌ దశలో తిరుగులేని అధిపత్యం చలాయించిన ఈ రెండు జట్లు ప్రదర్శన, బలాబలాల ప్రకారం చూస్తే .. సమాన స్థితిలో ఉన్నాయి. కాబట్టి హోరాహోరీ సమరం ఖాయం! ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడే జట్టుకు ఫైనల్‌ చేరేందుకు మ