హైదరాబాద్: ఐపీఎల్-8లో ఫిక్సింగ్ కలకలం రేగింది. బీసీసీఐ యాంటీ కరప్షన్ విభాగాన్ని రాజస్థాన్ ఆటగాడు సంప్రదించాడు. తనను బుకీలు సంప్రదించారని బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. మార్చిలో తోటి క్రికెటరే ఫిక్సింగ్ గురించి మాట్లాడాడని ఆటగాడు తెలిపాడు. ఫిర్యాదు స్వీకరించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ టీమ్ రంగంలోకి దిగింది. క్రికెటర్‌ను యాంటీ కరప్షన్ టీమ్ రహస్యంగా విచారిస్తోంది.




