హైదరాబాద్:దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో శుక్రవారం 60వ రైల్వే వారోత్సవాలను నిర్వహించనున్నట్లు సీపీఆర్వో ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియాలో మొదటి రైలు 1853 ఏప్రిల్ 16న బోర్బందర్ నుంచి థానేకు నడిచిందన్నారు. ఈ నేపథ్యంలో వారోత్సవాల సందర్భంగా ఎస్సీఆర్ ఏర్పాటు చేస్తున్న రైల్ ఎగ్జిబిషన్‌ను ఉదయం 10-15 గంటలకు జీఎం శ్రీవాత్సవ ప్రారంభిస్తారన్నారు. 60వ జోనల్ ఉత్సవాలను సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారని వివరించారు. సికింద్రాబాద్ బోయిగూడలో ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు.




