*వృద్దాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ!
_________________________
లింగంపేట్ 19 ఆగస్టు (జనంసాక్షి)
లింగంపేట్ మండల కేంద్రంలోని ఎస్టి జోసెఫ్ వృద్ధాశ్రమంలో 75 వ స్వాతంత్ర వజ్రోత్సవం పురస్కరించుకొని శుక్రవారం వృద్ధులకు ఎల్లారెడ్డి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేసినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వరూపరాణి తెలిపారు.ఇట్టి కార్యక్రమానికి లింగంపేట్ మండల ఎంపీపీ గరీబున్నీస,ఎల్లారెడ్డి సిడిపిఓ పద్మ, స్థానిక సర్పంచ్ బొల్లు లావణ్య చేతుల మీదుగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.వృద్దుల యోగక్షేమాలు తెలుసుకొని వృద్ధాశ్రమం లో అన్ని సదుపాయాలు ఉన్నాయ లేదా అని ఎంపీపీ,సిడిపీఓలు తెలుసుకున్నారు. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు సిస్టర్స్,లింగంపేట్ ఎంపిటిసి శమీమున్నీస టిఆర్ఎస్ నాయకులు నయీం ఫతియోద్దిన్,ఐసిడిఎస్ సిబ్బంది.మైపాల్,రవి,ప్రసాద్ అశోక్,స్థానిక అంగన్వాడీ టీచర్లు వృద్దులు పాల్గొన్నారు.




