Thursday, 5 November 2026

ఐ టి డి ఎ పరిదిలో సమ్మర్ గేమ్స్ విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలి: ఐటీడీఏ పీవో అంకిత్

 

 

 

 

 

 

 

కొత్తగూడ మే 16 జనంసాక్షి:గిరిజన ప్రాంతంలో ఉన్న విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ఐ టి డి ఎ పరిధిలో సమ్మర్ స్పెషల్ గేమ్స్ ను కొత్తగూడ స్పోర్ట్స్ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది.క్రీడా విద్యార్థులతో ఐటీడీఏ పీవో అంకిత్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరు క్రీడా లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.సమ్మర్ సీజన్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గిరిజన ప్రాంత విద్యార్థుల కోసం ఐటిడిఏ పరిధిలో గేమ్స్ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.స్పోర్ట్స్ పాఠశాలలో జిమ్ సెంటర్,వంట గది,భోజనాల గదిని,ఇటీవల సింథటిక్ పెయింట్ తో వేసిన బాస్కెట్ బాల్ కోర్టును పరిశీలించడం జరిగింది.మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని స్పోర్ట్స్ పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని అన్నారు.క్రీడా ప్రాంతంలో విద్యుత్ ఏర్పాటు చేయాలని ఐటీడీఏ ఏఈ రవికి ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏఈ రవి,ప్రధానోపాధ్యాయులు దేవదాస్,పిడిలు కొమ్మలు వెంకన్న లక్ష్మి,పి ఈ టి దేవేందర్ రమేష్ కోచ్ ధనాజీ తదితరులు పాల్గొన్నారు.