Tuesday, 3 November 2026

ఒంటరైన బాలుడుని తాతయ్య నాయనమ్మ ఒడికి చేర్చారు

హైదరాబాద్: సహజీవనం చేస్తోన్న ఇద్దరూ మృతి చెందడంతో ఒంటరైన బాలుడుని ఎట్టకేలకు తాతయ్య, నాయనమ్మ ఒడికి చేర్చారు. రెండు రోజుల క్రితం నగరంలోని కేపీహెచ్‌బీలో కర్ణాటకు చెందిన మంజునాథ్‌ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్న మీనాను చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.  పోలీసులు విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. దీంతో కర్ణాటకలో ఉన్న మంజునాథ్‌ తల్లిదండ్రులకు, మీ నా తల్లికి సమాచారం అందించారు. ముంజునాథ్‌ తల్లిదండ్రులు శనివారం నగరానికి వచ్చి కుమారుడు మరో యవతిలో సహజీవనం చేసిన విషయాన్ని తెలుసుకుని అవాక్కయ్యారు. గాంధీ ఆస్పత్రిలో శనివారం మంజునాథ్‌, మీనాలకు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం, మంజునాథ్‌ మృతదేహాన్ని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. మనవడిని తమకు అప్పగించమని పోలీసులను కోరారు. మంజునాథ్‌ మృతదేహం ఉన్న అంబులెన్స్‌లోనే కేపీహెచ్‌బీలోని బేబీకేర్‌ సెంటర్‌కు వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *