ఒక లక్షా 30 వేలకు వినాయక ప్రసాదం సొసైటీ చైర్మన్ ద్వావరి విష్ణువర్ధన్ రెడ్డి కైవసం.
తాండూరు సెప్టెంబర్ 4(జనంసాక్షి)వినాయక నిమర్జనంలో పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్వావరి విష్ణువర్ధన్ రెడ్డి ఒక్క లక్ష 30 వేలకు గణణతుని ప్రసాదం కైవసం చేసుకున్నారు. ఆదివారం తాండూరు పట్టణంలో వినాయక నిమర్జనం లోభాగంగా తాండూరు పట్టణంలోని సాయి పూర్ సిద్ధి వినాయక ఆలయంలో వినాయక లడ్డు వేలంపాటలో పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్వావరి విష్ణువర్ధన్ రెడ్డి లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక లడ్డును కైవసం చేసుకోవడం ఎంతో పుణ్యఫలమని అన్నారు.