సర్పంచ్ బానోత్ బుజ్జిని పరామర్శించిన – శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్

కురివి సెప్టెంబర్ -4 (జనం సాక్షి న్యూస్)

కురవి మండలం కంచర్ల గూడెం గ్రామ సర్పంచ్ బాణోత్ బుజ్జి గారి తల్లి ధారవత్ వాలి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మరణించారు. ఆదివారం వారి స్వగ్రామానికి వెళ్లి ఎమ్మెల్యే రెడ్యానాయక్ వాలి చిత్ర పటానికి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆయన వెంట మండల అధ్యక్షుడు తోట లాలయ్య,గుండ్రాతి మడుగు సొసైటీ చైర్మన్ గార్లపాటి వెంకట్ రెడ్డి,రైతు సమితి మండల కన్వీనర్ ముండ్ల రమేష్,టిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్, ఆలయ మాజీ ఛైర్మన్ బాదావత్ రాజునాయక్,యూత్ మండల అధ్యక్షుడు బాణోత్ రమేష్,పార్టీ గ్రామ అధ్యక్షుడు డీఎస్ బాలునాయక్, మాజీ సర్పంచ్ ఝంకిలాల్,పంతులు నాయక్,భద్రునాయక్, వీర్యనాయక్ తదితరులు ఉన్నారు.