ఒక వర్గం వారికి కొమ్ము క్కాస్తే , ఊరుకొనిది లేదు

  • రుద్రూర్ (జనంసాక్షి):
    రుద్రూర్ భజరంగ్ దళ్ మరియు విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం రోజున రుద్రూర్ బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ధర్మప్రసార్ పార్వతి మురళీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గం వారికి కొమ్ము కాస్తూ హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మండిపడ్డారు, ఒక వర్గానికి చెందిన మునవార్ ఫారుకి అనే వ్యక్తి హిందు దేవి దేవతలను దూషించడాని ఐన కూడా అలాంటి వ్యక్తీకి 1200 పోలీసులు బలగాల ను ఇచ్చి రాష్ట్ర రాజధాని లో సభను ఏర్పాటు చేసేలా అనుమతి ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు, హిందువుల పై భైంసా లో అల్లర్లు జరిగినపుడు , పాత బస్తీలో అల్లర్లు జరిగినప్పుడు ఈ పోలీసు వ్యవస్థ ఎందుకు కట్టు దిట్టంగా పనీ చేయలేదని ప్రశ్నిస్తూ డిజిపి పై మరియు మంత్రి కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు, హిందువుల పై చిన్నా చూపు చూస్తు, ఒక వర్గం వారికి కొమ్ము క్కాస్తే గ్రామ, మండల, నియోజకవర్గ , రాష్ట్ర స్థాయి వరకు గతంలో ఒక నిజామాబాద్ నాయకునికి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఇనదో అదే విధంగా ప్రతి ఒక్కరికీ బుద్ది చెప్పుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్వతి మురళి, ప్రశాంత్ గౌడ్, గంగాధర్, శివ, గణేష్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు