Tuesday, 3 November 2026

ఒబామా తాజ్మహల్ పర్యటన రద్దు

న్యూఢిల్లీ :  అమెరికా అధ్యక్షుడు ఒబామా తాజ్ మహల్‌ పర్యటన రద్దు అయింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం అధికారికంగా వెల్లడించింది. కాగా షెడ్యూలు ప్రకారం జనవరి 27న ఒబామా తన సతీమణి మిషెల్లీతో తాజ్‌ను సందర్శించాల్సి ఉంది. ఆగ్రా పర్యటన రద్దయితే ఒబామా త్వరగా స్వదేశం వెళ్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

కాగా ఒబామా తాజ్మహల్ ఈ నేపథ్యంలో తాజ్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సెల్ ఫోన్లు పనిచేయకుండా ఎలక్ట్రానిక్ జామర్లు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *