ఒబామా బిడ్డ జాబ్‌లో జాయినైంది!
ఒబామా పెద్ద కూతురు మలియా ఒబామా… సమ్మర్ లో పార్ట్ టైం జాబ్ చేస్తోంది. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీడియా రంగంలో సెటిలవ్వాలనుకుంటున్న మలియా…ఈ సమ్మర్ హాలిడేస్ లో అదే మీడియాలోనే జాయిన్ అయింది. తనకు ఎంతో ఇష్టమైన గర్ల్స్ అనే కార్యక్రమం ప్రొడక్షన్ లో మలియా కూడా పాలు పంచుకుంటోంది. నటి లీనా డన్హామ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మలియా రెగ్యులర్ గా ఫాలో అవుతుంటుంది. అంతేకాదు లీనా డన్హామ్ అంటే మలియా చాలా ఇష్టం. అందుకే లీనాతో పని చేసేందుకు మలియా ఆసక్తి చూపించింది.
ఇటీవలే 17వ పుట్టిన రోజు జరుపుకున్న మలియా గ్యాడ్యుయేషన్ తర్వాత టీవీ, సినిమా రంగంలో కొనసాగాలనుకుంటోంది. ఎప్పటికైనా ఫిల్మ్ డైరక్టర్ కావాలనేది మలియా కోరిక. అందుకోసం ఇప్పటి నుంచే ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో పని చేసి అనుభం సంపాదిస్తోంది. మీడియా రంగంలో మలియా పని చేయడం ఇది రెండో సారి. గతంలో కూడా ఆమె సీబీఎస్ చానెల్‌లో వచ్చే స్కీ-ఫీ అనే ప్రోగ్రాం కోసం పని చేసింది.
ఇప్పటికే గర్ల్స్ ప్రోగ్రాం కోసం ప్రొడక్షన్ టీంతో కలిసి మలియా పని చేస్తోందని హెచ్‌బీవో వర్గాలు చెబుతున్నాయి. ఆమె సెట్స్ లో ఉండగా దిగిన ఫోటో కూడా ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తోంది. నాన్న ఒబామా రాజకీయాల్లో ఉండటం వల్ల మలియాకు మీడియా రంగం అంటే ఇష్టం ఏర్పడిందని అంతా అనుకుంటున్నారు. కేవలం మలియా మాత్రమే కాదు గతంలో అమెరికా ప్రెసిడెంట్ గా చేసిన బిల్ క్లింటన్ కూతురు చెల్సియా క్లింటన్ కూడా మీడియా రంగంలోనే ఉంది. ప్రస్తుతం ఆమె ఎన్‌బీసీ టీవీలో స్పెషల్ కరస్పాండెంట్ వర్క్ చేస్తోంది.