ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు స్థానాలలో పోటీ

–పట్టణ ఉపాధ్యక్షుడు జిట్టా మల్లారెడ్డి
యాదాద్రి భువనగిరి (జనం సాక్షి):–
తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పట్టణ ఉపాధ్యక్షుడు జిట్ట మల్ల రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ రాను నా అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఓటమి భయంతో అభ్యర్థులను ప్రకటించారని, కెసిఆర్ రెండు స్థానాలను పోటీ చేయడం అంటే ఆయన ఓటమి ఒప్పుకున్నట్లేనని అన్నారు. గజ్వేల్ ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉండగా కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేసేందుకు రెండవ ఆప్షన్ గా ఎంచుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దిమా వ్యక్తం చేశారు.