ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించుకోవాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు 10
అర్హులైన వారందరూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించుకోవాలని గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ అన్నారు.డివిజన్ పరిధిలోని హనుమాన్ పెట్ కమ్యూనిటీ హాల్ లో ఓటర్ నమోదు కేంద్రాన్ని కార్పొరేటర్ మేకల సునిత యాదవ్ పరిశీలించారు.
18 ఏండ్లు నిండిన ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ లో జిహెచ్ఎంసి ఏర్పటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలలో  కాని మల్కాజిగిరి సర్కిల్ కార్యలయంలో ఓటు హక్కును  నమోదు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రామూయాదవ్,శానిటరీ సూపర్వైజర్ నాగరాజు,ఏవి స్వామి నాయకులు కార్యకర్తలు కాలని వాసులు  తదితరులు పాల్గొన్నారు.అనంతరం
ఐఎన్ నగర్ సాయి బాబా దేవాయల వార్షికోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ సీనియార్ నాయకులు మేకల రామూయాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస చారి,కుమార్,సాయి బబ్లు,నర్సింగ్ రావు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు