ఓటర్‌ లిస్టులో గమ్మత్తు: పక్షుల పేర్లకు చోటు

యూపిలో గమ్మత్తయిన ఘటన

లక్నో,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌ ఓటర్ల లిస్టులో తప్పులు దొర్లాయి. బాలియా జిల్లాలో ఓటర్‌ లిస్టును అప్‌డేట్‌ చేసిన తర్వాత ఓ గమ్మత్తు జరిగింది. స్థానిక ఓటర్ల పేర్లతో ఉన్న లిస్టులో.. ఫోటోలు వేరుగా ఉన్నాయి. ఫిల్మ్‌ హీరోయిన్‌ సన్నీ లియోన్‌, పావురాలు, జింకలు, ఏనుగులు కూడా… స్థానికుల ఓటర్ల లిస్టులో దర్శనమిచ్చాయి. రెండు పేజీల ఓటర్‌ లిస్టు లీకు కావడంతో ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో ఓటర్ల లిస్టు నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందన్న విషయం అర్థమైంది. 51 ఏళ్ల ఓ మహిళ పేరుతో ఉన్న ఓటర్‌ లిస్టులో.. సన్నీ లియోన్‌ ఫోటో దర్శనమిచ్చింది. మరో ఓటర్‌ లిస్టులో 56 ఏళ్ల మహిళ స్థానంలో.. ఓ ఏనుగు బొమ్మను పెట్టారు. సుమారు 8 మంది ఓటర్ల పేర్లను జంతువులు, పక్షుల ఫోటోలతో ట్యాంపర్‌ చేసినట్లు అధికారులు గుర్తించారు. డేటా ఆపరేటర్‌ విష్ణు దేవ్‌ వర్మను అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు చెప్పారు.