ఓటు హక్కు పై అవగాహన కల్పించిన విద్యార్థులు
జనంసాక్షి, కమాన్ పూర్ :
మంథని జెఎన్టీయు ఇంజ నీరింగ్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో గత ఐదు రోజులుగా ప్రత్యేక శిభిరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఓటు నమోదు, ఓటింగ్‌పై వాలంటీర్లు గ్రామస్తులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా ర్యాలీ నిర్వహించారు. అలాగే ఇంటికి తిరుగుతూ తెలియపరిచారు. ప్రజాస్వామ్యదేశంలో ఓటు అత్యంత ముఖ్యమైందని, చక్కటి పాలకులను ఎంచుకోవడానికి ఓటు హక్కు ఎంతగానో దోహద పడుతుందని వాలంటీర్లు గ్రామస్తులకు తెలియపరిచారు. ఓటు నమోదు చేసుకోని వారు తక్షణమే చేసుకోవాలని, ఎలా చేసుకోవాలి సూచించారు. ప్రోగ్రాం అధికారి ఆర్ దుర్గారావ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కోఆర్డినేటర్లు సదానందం, రవివర్మ, వాలంటీర్లు పాల్గోన్నారు