హైదరాబాద్: బల్దియా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఖైరతాబాద్‌లోని 17వ పోలింగ్ కేంద్రంలో తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు ఓటు హక్కు వినియోగంచుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో సినీనటుడు అల్లు అర్జున్, అజాంపురాలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మారేడుపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, భాజపా ఎమ్మెల్యే లక్ష్మణ్ చిక్కడపల్లిలో, రాష్ట్రమంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ హిమాయత్‌నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.