చిన్న పిల్లాడికి స్నానం చేయించిన వివేకానంద
హైదరాబాద్,అక్టోబర్30(జనంసాక్షి): తెలంగాణలో ముందస్తు ఎన్నికల సమరంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. వినూత్నంగా ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కొందరు అభ్యర్థులు దోసెలు వేయడం, పాడె మోయడం వంటి కార్యక్రమాలు చేయగా.. తాజాగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ తెరాస అభ్యర్థి వివేకానంద.. చిన్న పిల్లాడికి స్నానం చేయించి ఆకట్టుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని దుండిగల్, నాగులూరు, తాండ-1, తాండ-2లలో ‘గుండె గుండెకు గులాబీ జెండా’ పేరుతో కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా తెరాస అభ్యర్థి కె.పి. వివేకానంద ప్రజలను కలుస్తూ ఓ ఇంటి వద్ద చిన్నపిల్లాడికి స్నానం చేయించారు. మరోచోట ఎన్నికల ప్రచారంలో ఎంపీ మల్లారెడ్డి సైతం డోలు వాయిస్తూ నృత్యం చేసి హుషారెత్తించారు.




