(జనంసాక్షి) జూలై 16
అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్ లోని రామచంద్రపురం కాలనీ ఓపెన్ జిమ్ జిహెచ్ఎంసి పార్క్ ను మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్థానిక కార్పొరేటర్ చింతల విజయశాంతి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ అధికారులు తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కాలనీ అధ్యక్షులులక్ష్మీనారాయణన్, జనరల్ సెక్రెటరీ చంద్రకాంత్ ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. కాలనీకి కావలసిన సీసీ కెమెరాలు గాని గ్రీన్ కార్పెట్ గ్రాస్ షటిల్ కోర్ట్ అసాంఘిక కార్యకలాపం జరగకుండా పోలీస్ వారికి మౌలిక అంశాలపైఎమ్మెల్యేకు తెలియజేయడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే స్పందించి అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు వ్యాయామం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ప్రజలు ఓపెన్ జిమ్ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి, ఈఈ రాజు, డిఈ ప్రశాంతి, అల్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్, ఆర్టికల్చర్ అధికారి నవీన్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ బుచ్చయ్య, ఎలక్ట్రికల్ ఏఈ స్వాతి, టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు బి నాగేశ్వరరావు, బలవంత రెడ్డి, ఉదయ్, అరవింద్, లోకేష్, సూర్య కిరణ్, ప్రవీణ్, ప్రేమ్, మధు, జ్యోతి, కవిత, బబిత, కాలనీ వాసులు మాజీ కౌన్సిలర్ నిమ్మ కిష్టారెడ్డి, సుబ్బయ్య, రాజు, మహేందర్, ప్రశాంత్ కుమార్, వంశీ, రోహిత్, అగర్వాల్, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.




