హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉస్మానియా లో ఉద్రిక్తత నెలకొంది. పేదల ఇళ్ల కోసం ఓయూ భూములను స్వాధీనం చేసుకుంటామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన, ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యం పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్త చేశారు. ఈ నేపథ్యంలో ఆవిర్భావ వేడులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విద్యార్థులు, వేడుకలకు నిరసనగా ర్యాలీ నిర్వహించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో వర్శిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.




