ఓయూ పిజీ కళాశాల మరమ్మతుల కొరకు 20 లక్షలు రూపాయలు మంజూరు చేస్తునట్టు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు. శుక్రవారం తన క్యాంప్ ఆఫీస్ లో కలిసిన ఉస్మానియా యూనివర్సిటీ డిస్టిక్ పిజి కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ జయప్రకాష్ రావు మరియు జోగిపేట కలశాల ఇంచార్జి ప్రిన్సిపల్ డాక్టర్ యాట ప్రవీణ్ కుమార్ ఇచ్చిన వినతి పత్రనికి వెంటనే స్పందిస్తూ అప్పటికప్పుడు 20 లక్షలు మంజూరుకు హామీ ఇస్తూ అలాగే కళాశాల కు నూతన భవనముల కొరకు రావలసిన బకాయి 24 కోట్ల రూపాయల విడుదల కొరకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని తెలిపారు.అదే విధంగా వసతులు కలిపిస్తే
వచ్చే విద్యా సంవత్సరం నుండి పిజి కళాశాలలో కొత్త కోర్సులు ప్రారంభించడానికి, కృషి చేస్తామని పిజీ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ జయప్రకాష్ రావు,జోగిపేట కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ యాట ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఆందోల్ నియోజకవర్గం లో కేజీ టు పీజీ విద్య అమలుకు టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ఎల్లప్పుడు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిబ్బంది హరిప్రసాద్ సుబ్రమణ్యం ఉమాపతి రమ్య సిద్దప్ప పోచయ్య విద్యార్థి పాపయ్య తదితరులు పాల్గొన్నారు
ఓయూ పిజీ కళాశాల మరమ్మతుల కొరకు 20 లక్షలు రూపాయలు మంజూరు చేస్తునట్టు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు.




