మంత్రి సత్యవతిరాథోడ్ కు ఘనస్వాగతం పలికిన నాయకులు, అభిమానులు
కురవి సెప్టెంబర్-16 (జనంసాక్షి న్యూస్)
తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ- శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం జాతీయ సమైక్యత వారోత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కార్యక్రమంలో పాల్గొనుటకు హెలికాప్టర్ ద్వారా తన సొంత గ్రామమైన పెద్ద తండాకు వచ్చిన సందర్భంగా పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు, అధిక సంఖ్యలో బోకే ఇచ్చి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా స్వాగతం పలికిన జిల్లా పరిషత్ చైర్మన్ అంగోత్ కుమారి బిందు, కురవి జడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి,కొంపలి శ్రీనివాస్ రెడ్డి, బయ్యారం పిఎసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి,కొంపలీ శ్రీధర్ రెడ్డి,ఆయిలి నరహరి గౌడ్, గూగు లోతు నెహ్రూ నాయక్, బాదె నాగన్న,సర్పంచ్ లు,ఎంపీటీసీలు అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు