Wednesday, 4 November 2026

ఓయూ స్పాట్‌లో అగ్నిప్రమాదం

జవాబుపత్రాల దగ్ధం: విద్యార్థుల్లో ఆందోళన

హైదరాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఉదయం స్పాట్‌ వాల్యుయేషన్‌ చేసేటప్పుడు అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. ఒయు విసి రామచంద్రం, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాదంలో పలు పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలు దగ్ధమైనట్టు సమాచారం. సోమవారంతో పరీక్షలు ముగియగా ప్రశ్నాపత్రాల స్పాట్‌ మొదలయ్యింది. జవాబు పత్రాలు దగ్ధం కావడంతో ఇప్పుడు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.