ఓరుగంటి యువసేన పేరుతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఉపేక్షించేది లేదు.
,జూలై13,(జనంసాక్షి): మండల కేంద్రంలో తెరాస మండల అధ్యక్షులు పాకల మహిపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓరుగంటి యువసేన పేరుతో టిఆర్ఎస్ పార్టీకి భంగం కలిగేలా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని జిల్లా టిఆర్ఎస్ పార్టీ చాలా క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకొని ఇకపై నుండి ఓరుగంటి యువసేనకు టిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదని తెరాస జిల్లా అధ్యక్షులు జి.వి రామకృష్ణారావు కరపత్రాన్ని విడుదల చేశారు.ఇకపైనుండి టిఆర్ఎస్ పార్టీ కి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని మండలంలోని టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్ యకర్తలు తెలియజేశారు.