Tuesday, 3 November 2026

మరల రేషన్ కార్డు లు జారీ: పౌర సరఫరాల శాఖ

నాచారం( జనం సాక్షి): మేడ్చల్ మల్కాజ్గిరి  జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా గతంలో కార్డు ఉండి తదుపరి వివిధ కారణాలతో రద్దు చేయబడిన రేషన్ కార్డులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం తదుపరి ఇంటింటికి వెళ్లి పూర్తి విచారణ జరిపి అర్హులైన రద్దు చేయబడిన రేషన్ కార్డుదారులకు మరల రేషన్ కార్డులను పునరుద్ధరించవలసిందిగా ఆదేశించడం జరిగింది . గతంలో రద్దు చేయబడిన కార్డు లు మొత్తము 95,040 ఉన్నవి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గతంలో రద్దు చేయబడిన కార్డుదారుల ఇంటి వద్దకు నియమించబడిన అధికారులు ఈ నెల 12 నుండి తనిఖీ నిమిత్తము విచ్చేయుచున్నారు . కావున అట్టి రద్దు చేయబడిన కార్డుదారులు తనిఖీ అధికారులు వచ్చనప్పుడు ఇంటిదగ్గర అందుబాటులో ఉండగలరు. ఇంటి చిరునామా లో లేదా ఫోన్ నెంబర్ తదితర విషయాలలో ఏమైనా మార్పులుచేర్పులు ఉన్నచో సంబంధిత తహసిల్దార్ లేదా సహాయ పౌర  సరఫరాల కార్యలయంలో సంప్రదించగలరు.