ఓల్డ్ బోయినపల్లి లో జనహృదయ నేత కేటీఆర్ జన్మదిన వేడుకలకు హాజరైన కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు
కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 24 జనహృదయ నేత బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కలిగి మలిదశ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అసలుసిసలు తెలంగాణ వాది ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన పురస్కరించుకొని కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బర్తడే వేడుకలకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కే.టి రామారావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి మహిళలకు చీరల పంపిణీ చేసినారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ కేటీఆర్ జన్మదిన రోజున ప్రతి సంవత్సరం ఓల్డ్ బోయిన పల్లి కార్పొరేటర్ నరసింహ యాదవ్ పేదలకు దుప్పట్లు, చీరల పంపిణీ చేయటం తెలిసిందే లాగే ఈ సంవత్సరం కూడా మహిళలకు 2000 చీరలు పంపిణీచేశారు.అదేవిధంగా వికలాంగులైన చిన్న అబ్బాయికి 65 వేల రూపాయలవీల్ చైర్ ను ఈరోజు కేటీఆర్ బర్త్డే సందర్భంగా కార్పొరేటర్ నరసింహ యాదవ్ డొనేట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నరేందర్ గౌడ్,బల్వంత్ రెడ్డి, కర్రే జంగయ్య, కర్రే లావణ్య, నర్సింగ్ రావు, మన్నే ఉదయ్ యాదవ్, ఇర్ఫాన్,హరినాథ్, పిట్ల రాజు,బుర్రి యాదగిరి,మట్టి శ్రీనివాస్, జాంగిర్,చందు యాదవ్, మల్లేష్ యాదవ్,దుర్గా,సంతోషి, సునంద,ఉమా, దేవి,శశికళ, రోజా, పద్మలత,ఉదయ్ రాణి,సరోజ,లలిత, అనురాధ,చారి,గణేష్ కుమార్,ఖదీర్, బాల్రాజ్, పోచయ్య,అశోక్, గణేష్, శ్రీనివాస్ రెడ్డి,బాలరాజ్, సిరాజ్, జెకె,సలీం బాబా సీనియర్ కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.