పచ్చదనానికి ప్రాధాన్యం ఇచ్చే చర్యలు
త్వరితంగా ఉప్ప శిల్పారమం పూర్తి
హెచ్‌ఎండిఎ అధికారులతో మంత్రి కెటిఆర్ సవిూక్ష
హైదరాబాద్,జూన్ 5(జనం సాక్షి ): హైదరాబాద్‌కు మణిహారంగా మాదిరిగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మరిన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇంటర్ చేంజ్ ల వద్ద వే సైడ్ అమెనిటీస్ ఏర్పాటు చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఔటర్ చుట్టూ పెద్ద ఎత్తున గ్రీనరీ పెంచుతున్నామని చెప్పారు. ఓఆర్‌ఆర్ పై ప్రతీ పది కిలోవిూటర్లకు ఒక అంబులెన్స్ ఉండేలా చూడాలని సూచించారు. హెచ్ ఎండీఏ చేపట్టిన ప్రాజెక్టులు, ఇతర కార్యకలాపాలపై మంత్రి కేటీఆర్ సుదీర్ఘ సవిూక్ష జరిపారు. హైదరాబాద్ బేగంపేటలో జరిగిన సమావేశంలో పురపాలక శాఖ, హెచ్ ఎండీఏ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై కల్పించాల్సిన మౌలిక వసతులు, ఉప్పల్‌లో శిల్పారామం పనులు, బాట సింగారం, మంగల్ పల్లి లాజిస్టిక్ పార్కులు తదితర అంశాలపై చర్చించారు.ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై పూర్తి స్థాయిలో ఎల్ ఈడీ లైట్లు ఏర్పాటు చేసే పక్రియను మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.జన సమ్మర్థం ఉన్న ప్రాంతాలను గుర్తించి? రేడియల్ రోడ్లు, గ్రిడ్ రోడ్లను మరింత వేగంగా అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. హెచ్ ఎండీఏ అధ్వర్యంలో ఉప్పల్ ప్రాంతంలో చేపడుతున్న శిల్పరామం పనులు దసరా నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలియజేశారు. అటు, హెచ్ ఎండీఏ సంస్థ చేపట్టిన బాట సింగారం, మంగల్ పల్లి లాజిస్టిక్స్ పార్కుల పురోగతిపై మంత్రి కేటీఆర్ సవిూక్ష జరిపారు. సంస్థ పరిధిలో త్వరలోనే 40 చెరువులకు సంబంధించిన పనుల కోసం టెండర్లను పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతీ ప్రాజెక్టుకు ఒక టైం లైన్ పెట్టుకుని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అటు, బాలానగర్ లో నిర్మితమవుతున్న ్గ//-ల ఓవర్ పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించారు. హైదరాబాద్ లో నిర్మిస్తున్న పుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలను జీహెచ్ ఎంసీతో కలిసి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.హెచ్ ఎండీఏ పనితీరు, ప్రాజెక్టుల అమలుపై మంత్రి కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కమిషనర్ ను ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో సంస్థ అధికారులు ఎక్కువగా భాగస్వాములు కావాలన్నారు. ప్రజల సౌకర్యార్థం టౌన్ ఎ/-లానింగ్, ఇతర అనుమతులు పక్రియను మరింత సులభతరం చేయాలని చెప్పారు. హెచ్ ఎండీఏ అనుమతులున్న లే-ఔట్లలో ఇళ్ల నిర్మాణానికి సత్వరం అనుమతుల వచ్చేలా మంత్రి కేటీఆర్ కొన్ని మార్పులను సూచించారు. హైదరాబాద్ కు నలువైపులా బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూముల గుర్తించాలని
అధికారులను అదేశించారు. దీనికి సంబంధించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు.




