Wednesday, 4 November 2026

రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ కార్యక్రమాలు

పిల్లలకు పర్యావరణ పోటీలు

మెదక్‌లో పర్యావరణ ఉత్సవాల్లో పాల్గొన్న హరీష్‌

హైదరాబాద్‌,జూన్‌ 5(జనం సాక్షి ): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. కాలుష్య కారకాల వాడకాన్ని తగ్గించి వీలైనంతగా పర్యావరణాన్ని కాపాడుకోవటం, మానవుల మనుగడకే పెనుముప్పుగా ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలనే సృహతో అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో అవగాహనా కార్యక్రమాలు, సైకిల్‌ ర్యాలీలు, స్కూలు పిల్లలకు పెయింటింగ్‌, డ్రాయింగ్‌, ఇతర పోటీలను కూడా నిర్వహించారు. అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్‌ లో ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పర్యావరణాన్ని కాపాడుతామని, తమ వంతు బాధ్యతను నెరవేరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న కేబీయార్‌ పార్క్‌ , హరిణ వసస్థలి పార్కుల్లో కూడా పర్యావరణం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కేబీయార్‌ పార్కులో విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమానికి యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటీష్‌ కొలంబియా ప్రొఫెసర్‌ సుజీ లావెల్లే హాజరయ్యారు. పర్యావరణ ముప్పును ఎదుర్కొనే బాధ్యత యువతరం పైనే ఉందని, ప్లాస్టిక్‌ ను వాడొద్దనే అవగాహన మరింతగా పెరగాలని ఆమె కోరారు. హరిణ వనస్థలిలో నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు రెండు వందల మంది స్కూలు పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిత్య జీవితంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గిస్తామని, పర్యావరణహితం కోసం హరితహారంలో పాల్గొని మొక్కలు పెంచుతామని ప్రతినబూనారు. అదనపు అటవీ సంరక్షణ అధికారిణి, సీనియర్‌ ఐ.ఎఫ్‌.ఎస్‌ ఆర్‌. శోభ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్ని పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. పీసీసీఎఫ్‌ రఘువీర్‌, అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్‌.ఎం.డోబ్రియల్‌ ప్రగతి రిసార్ట్‌ లో ఒక జాతీయ పత్రిక నిర్వహించిన సెమినార్‌ లో పాల్గొన్నారు. పర్యావరణం కోసం పౌరులుగా మనం చేయాల్సిన పనులు, ప్రతీ వ్యక్తి, ఇంటి నుంచే మొదలు కావాల్సిన ఎ/-లాస్టిక్‌ నియంత్రణ, పర్యావరణ హిత కార్యక్రమాలపై ప్రసంగించారు. అటు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన సదస్సులు, సైకిల్‌ ర్యాలీలు, స్వచ్చ కార్యక్రమాలు జరిగాయి. మెదక్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ర్యాలీలో స్వయంగా పాల్గొన్న నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు జెండా ఊపి పర్యావరణ ర్యాలీని ప్రారంభించారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ లో ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కుమార్‌ నేతృత్వంలో ప్లాస్టిక్‌ నియంత్రణ, నల్లమలలో వాహనాల్లో ప్రయాణించే వారికి ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల అడవికి, వన్యప్రాణులకు ముప్పుపై అవగాహన కల్పించారు. వరంగల్‌ ఫారెస్ట్‌ సర్కిల్‌ లో చీఫ్‌ కన్జర్వేటర్‌ ఎం.జె.అక్బర్‌ నేతృత్వంలో అటవీ రక్షణ, పర్యావరణహితంపై ట్రెక్కింగ్‌ తో పాటు పిల్లలకు డ్రాయింగ్‌, పెయింటింగ్‌ కార్యక్రమాలు నిర్వహించారు. నర్సాపూర్‌ అటవీప్రాంతంలో, రోడ్డు వెంట పేరుకు పోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను అటవీ శాఖ సిబ్బంది, స్థానికులతో కలిసి తొలగించారు. రహదారి ప్రయాణీకులకు అవగాహన కల్పించారు. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ శరవరణ్‌, సిబ్బంది స్కూలు పిల్లలకు పర్యావరణ అవగాహన, పోటీలను నిర్వహించి బహుమతులు అందించారు. కాగజ్‌ నగర్‌ అటవీ ప్రాంతంలో సిబ్బంది, అధికారులు కలిసి ఎ/-లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల నిషేధంలో అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు.