Tuesday, 3 November 2026

ఔటర్‌ రింగు రోడ్డుపై ప్రమాదం: ఒకరు మృతి

హయత్‌నగర్‌: ఔటర్‌ రింగురోడ్డు సమీపంలోని కొహెడ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని బేగంబజార్‌కు చెందిన బస్వరాజ్‌ (45) మరో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కల్వర్ట్‌ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్వరాజు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *