Thursday, 5 November 2026

ఔషధనగరి ఏర్పాటుతో సిటీ కాలుష్యం దూరం

త్వరగా పనులు పూర్తి కావాలంటున్న నిపుణులు

హైదరాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ): ఫార్మా కంపెనీలను సిటీ నుంచి తరలిస్తే వాతావారణ కాలుష్యం తగ్గగలదని నిపుణులు భావిస్తున్నారు. ప్రబుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు సకాలంలో సాగాలని కోరకుంటున్నారు. దీంతో నరగంలో వాయు,వాతావరణ కాలుష్యం తగ్గగలదన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అవతలికి ఫార్మా కంపెనీలను తరలించాలన్న మంత్రి కెటిఆర్‌ ఆదేశాల మేరకు నగరంలో ఉన్న పరిశ్రమలను తరలించేందుకు రంగం సిద్దం చేశారు. మౌలిక వసతుల కల్పన ద్వారా పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా వెసులుబాటు కలగనుంది. కేటాయింపుల సమయంలో మౌలిక వసతుల వివరాలను పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం వివరిస్తుంది. గతంలో పరిశ్రమల స్థాపనకు రెండేళ్ల వరకు గడువు ఇచ్చేవారు. ఇప్పుడు మౌలిక వసతుల కల్పన దృష్ట్యా ఈ గడువును తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. తమకు కేటాయించిన స్థలానికి సరైన సౌకర్యాలు లేవంటూ పనులను చేపట్టేవి కావు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సాకుతో భారీ ప్రాజెక్టులు ప్రారంభం కాలేదు. దీంతో వేల ఎకరాల భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని నివారించేందుకు టీఎస్‌ఐఐసీ పూనుకుంది. పరిశ్రమల స్థాపనకు గుర్తించిన భూములకు ముందే అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి, ఆ తర్వాత వాటిని కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.200 కోట్లతో మౌలిక వసతులను చేపట్టింది. ఫార్మా కంపెనీలకు కేటాయించిన స్థలాల్లో రహదారులు, విద్యుత్‌,నీటి సరఫరా వంటి మౌలిక వసతులను కల్పించింది. పారిశ్రామిక సంస్థలకు ఇప్పటి వరకు భూములను కేటాయించడం వరకే ప్రభుత్వం శ్రద్ధ తీసుకునేది. మొదటి దశలో రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల వద్ద ఏర్పాటు చేయనున్న హైదరాబాద్‌ అంతర్జాతీయ ఔషధనగరి వద్ద ఆరువేల ఎకరాలు, జహీరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్‌)లో మూడువేల ఎకరాలు, వికారాబాద్‌, మేడ్చల్‌, యాదాద్రి, మెదక్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాల్లో మౌలిక వసతులు కల్పించింది. ఈ స్థలాలను జాతీయ రహదారులకు,. రాష్ట్ర రహదారులకు అనుసంధానం చేశారు. విద్యుత్‌ లైన్లను ఏర్పాటు చేశారు. అంతర్గత రహదారులను సిద్ధం చేశారు. మంచినీటి సరఫరా వ్యవస్థను కల్పించారు. టెలికమ్యూనికేషన్స్‌ కోసం ్గ/బైర్‌ కేబుళ్లను సైతం వేశారు. పారిశ్రామికవేత్తలు తమకుకేటాయించిన భూముల ప్రాతిపదికన భవన నిర్మాణాల ప్రణాళికలను తయారు చేసుకొని పనులను చేపట్టవచ్చు.