Thursday, 5 November 2026

కంటి వెలుగును అందిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్.

– నెన్నెల ఎంపీపీ సంతోషం రమాదేవి.
నెన్నెల, జనవరి19
( జనం సాక్షి)
రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా కంటి సమస్యలతో బాధపడొద్దనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కెసిఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని నెన్నెల ఎంపీపీ సంతోషం రమాదేవి అన్నారు. గురువారం ఆమె బెల్లంపల్లి ఆర్డివో శ్యామల దేవితో కలిసి ఆవడం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల ప్రజలు కంటివెలుగును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచితంగానే కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, కళ్ళద్దాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగానే కంటి ఆపరేషన్‌లు చేయించడం జరుగుతుందని వివరించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అన్నారు. అవసరమైన వారికి కంటి వెలుగును ప్రసాధిస్తున్న గొప్ప వ్యక్తి కెసిఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కంటి పరీక్షలకు అందరు వచ్చే విధంగ చూడాలని చెప్పారు
కంటి వెలుగు వైద్య శిబిరానికి 18 సంత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు పాల్గోనేలా, ఎవరికి ఎలాంటి కంటి సమస్యలు ఉన్నా అత్యున్నత ప్రమాణాలతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, కళ్ళఅద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సింగతి శ్యామల, తహసీల్దార్ భూమేశ్వర్, మెడికల్ ఆఫీసర్ ఝాన్సీ, ఎంపీడీఓ వరలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ చీర్ల సత్తమ్మ, ఏపీఎం విజయలక్ష్మి, కంటివెలుగు మెడికల్ ఆఫీసర్ భవాని, అప్టోమెట్రిస్ట్ రాజు, సింగల్ విండో చైర్మన్ మేకల మల్లేష్, నాయకులు సంతోషం ప్రతాప్ రెడ్డి, సింగతి రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.