కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి


జనంసాక్షి , కమాన్ పూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం జూలపల్లి గ్రామపంచాయతీలో కంటివెలుగు వైద్య శిబిరాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన కమాన్ పూర్ ఎంపీపీ రాచకొండ లక్ష్మీ , కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాయలింగు, స్థానిక సర్పంచ్ బొల్లపల్లి శంకర్ గౌడ్ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని పేదప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోని పేదప్రజల కంటి పరీక్షల కోసం కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని అమలుచేసి కంటి పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేస్తున్నారని, పేదప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అనునిత్యం పరితపించే ముఖ్యమంత్రివర్యులు ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని తెలిపారు. పేద ప్రజలు అందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ ఏ.ఎం.సి వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, ఎంపిటిసిలు అబ్బిడి వినోద, షేవ్వ శంకరయ్య, ఉప సర్పంచ్ పోల్దాసరి సాయికుమార్, కమాన్ పూర్ మండల ఎంపిఓ శేసయ్య సూరి, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, వార్డు సభ్యులు బండ రాయలింగు, కటికీరెడ్డి రాజేశ్వరి, బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పోల్దాసరి వినోద్, నాయకులు మెరుగు వెంకటేశం, ఆడెపు సారయ్య, డాక్టర్ సాహితి , ఏఎన్ఎం వినోద, మెటిల్డా, ఆశా కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.