Thursday, 5 November 2026

కంటోన్మెంట్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఉచిత మెగా వైద్య శిబిరం ను ఏర్పాటు చేసిన: శ్రీ గణేష్

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 11 సిక్ విలేజ్ లోని శ్రీరామ్ నగర్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ కోసం కంటోన్మెంట్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా వైద్యశిబిరం ను ఏర్పాటు చేయడం తో పాటు ఈ శిబిరం ద్వారా కంటి పరీక్షలు,అవసరమైనా వారికీ కంటి ఆపరేషన్ లేదా కంటి అద్దాలు,దంత సమస్యలు,బి.పి,షుగర్ టెస్ట్,ఇ.సి.జి, ప్యూర్ ఆడియోమీటర్ చెవి వినికిడి సమస్యలు వంటి పలు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీగణేష్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి ఈ విధమైన వైద్య శిబిరాలను కంటోన్మెంట్ వ్యాప్తంగా నిర్విరామంగా నిర్వహించడం జరిగిందని అలాగేఇక ముందు కూడా కొనసాగుతాయని తెలిపారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా అవసరమైన ప్రాంతంలో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేస్తూ నా కంటోన్మెంట్ లో ని ప్రజలందరు ఆరోగ్యంగా ఉండడమే తన లక్ష్యం అని శ్రీగణేష్ తెలియజేశారు. ఈ వైద్య శిబిరంను కేర్ హాస్పిటల్ ముషీరాబాద్ వారి సౌజన్యంతో శ్రీరామ్ నగర్ లో శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ మహేందర్, కంటి చూపు వైద్యులు, డాక్టర్ కిరణ్,దంత వైద్యులు, డాక్టర్ రామచంద్ర సాగర్, డాక్టర్ షబ్బీర్ అస్లాం,చెవి,ముక్కు,నాలుక, డాక్టర్ మొయినోద్దీన్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సూర్య ప్రకాష్ గుండె సంబందిత మరియు కేర్ హాస్పిటల్ క్యాంప్ కోఆర్డినేటర్ నందగిరి శ్రీకాంత్ పాల్గొని ప్రతి ఒక్కరికీ అన్నిరకాల పరీక్షలు నిర్వహించి పలు సేవలను అందించడం జరిగింది.ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమం విజయవంతం చేయుటకు సహకరించిన షేక్ ఖాజా,మధు, అవినాష్,రాకేశ్, సైదులు,శ్రావణ,సతీష్ మరియు శ్రీరామ్ నగర్, అంబేద్కర్ నగర్, సిక్కు విలేజ్ స్థానికులకు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీగణేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.