Tuesday, 3 November 2026

కక్ష పూరితంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మీద అక్రమ కేసులు

 ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి మిద్దెల జితేందర్
 ఎల్బీ నగర్ (జనం సాక్షి  )  కేంద్ర బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు యువనేత రాహుల్ గాంధీ పై అక్రమంగా ఈడి నోటీసులు ఇప్పించారని ఐఎన్టిసి రాష్ట్ర అధ్యక్షులు ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి మిద్దెల జితేందర్ ఆరోపించారు సోనియాగాంధీని ఈడీ కార్యాలయానికి విచారణ కోసం రమ్మని పిలవడానికి నిరసిస్తూ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు గురువారం చంపాపేటలో ని ఐ ఎన్ టి యూ సి కార్యాలయం నుండి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు బయల్దేరారు. ఈ సందర్భంగా మిద్దెల మాట్లాడుతూ కక్ష పూరితంగా సోనియాగాంధీ రాహుల్ గాంధీ అక్రమ కేసులు బనాయించారని ఆయన అన్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీకి వీస్తున్న గాలికి భయపడి ప్రధాని మోడీ ఈడి కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు అవినీతి అక్రమాలకు పాల్పడని వారిపై  కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు