పె
ద్దనోట్ల రద్దుతో ఈ నెల వేతనాలకూ కటకటలాడే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వ రాబడి పడిపోయింది. నెలవారీ ఆదాయం సగానికిపైగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. పెద్దనోట్ల రద్దుతో కొనుగోళ్లు, అమ్మకాలు జరగక వాణిజ్య పన్నులు, ఎక్సయిజ్, రిజిసే్ట్రషన్లు తదితర ఆదాయాలు సగానికి పైగా పడిపోయాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించా రు. పన్నుల ద్వారా ఈ ఏడాది రూ.54,869 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభు త్వం అంచనా వేసుకుంది. ఆ లెక్కన ఈ నెల రూ.4,500 కోట్ల ఆదాయం సమకూరాలి. పెద్దనోట్ల రద్దుతో క్రయ విక్రయాలు, రిజిస్ర్టేషన్లు స్తంభించడం, ఎక్సయిజ్ ఆదాయమూ సగానికిపైగా పడిపోవడంతో నవంబర్‌లో రూ.2 వేల కోట్లకు మించి ఆదాయం రాదని అధికారులు వివరించినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నందున కేంద్ర పన్నుల వాటాల్లోనూ కోతపడే అవకాశం ఉందన్నారు. ఈ నెల రావాల్సిన కేంద్ర పన్నుల వాటాలో రూ.450 కోట్ల మేరకు కోత పడిన సంగతిని ప్రస్తావించారు. ప్రభుత్వోద్యోగుల వేతనాలు భారీగా పెరగడంతో వేతనాలకే రూ.3వేల కోట్ల కు పైగా ఖర్చవుతోంది. ఈ నెల పన్నులు, ఇతర ఆదాయం రూ.2 వేల కోట్లకు మించని పరిస్థితుల్లో వేతనాలు చెల్లించడంపై సీస్ రాజీవ్‌శర్మతో సీఎం కేసీఆర్ సమీక్షించినట్లు తెలిసింది. ఆర్థిక శాఖ సహా అన్ని శాఖల అధికారులతో సమావేశమై ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎ్‌సను ఆదేశించారు. అన్ని శాఖల్లో ఖర్చులు తగ్గించుకోవాలని, అత్యవసరమైతే తప్ప చెల్లింపులు, వ్యయాలు జరపకూడదంటూ ఆదేశాలివ్వాలని సీఎ్‌సకు సూచించినట్లు సమాచారం.
కటకటలాడుతున్న తెలంగాణ




