కటీపీఎస్‌లో నిలిచిపోయిన విద్యుత్‌ ఉత్పత్తి

ఖమ్మం: కొత్తగూడెం నిర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇక్కడి తొమ్మిదో యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది లోపం సరిదిద్ది విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.