సికింద్రాబాద్ (జనం సాక్షి ) : సికింద్రాబాద్ లోని చరిత్రాత్మకమైన చిలకలగూడ కట్ట మైసమ్మ దేవాలయంలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి రాసురి సునిత, శ్రీమతి కంది శైలజ, దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ కృష్ణ, ఆలయం కార్య నిర్వహణాధికారి మహేందర్ గౌడ్ లతో తెరాస యువ నేతలు కిషోర్ కుమార్ కిరణ్ కుమార్ , రమేశ్వర్ గౌడ్ లతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం జలమండలి అధికారులు ఏర్పాటు చేసిన వాటర్ క్యాంపును పద్మారావు గౌడ్ ప్రారంభించారు. రాష్ట్ర వైద్య శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
కట్ట మైసమ్మ దేవాలయంలో పట్టు వస్త్రాలు సమర్పించిన ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్




