కట్నం డబ్బుతో ఉడాచించిన వరుడు
నిజామాబాద్: మరికొద్ది సేపట్ల్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు కాస్తా కట్నం డబ్బులతో పెళ్లికి ముందే ఉడాయించాడు. నిజామాబాద్ ఆర్యనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు కనిపించకపోవడంతో పెళ్లింట్లో కొంతసేపు గందరగోళం నెలకొంది. పారిపోయిన ప్రబుద్ధుడి కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో పెళ్లికుమార్తె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.