Tuesday, 3 November 2026

కడవేర్గు హరిత సైనికుడికి సన్మానం..

(జనంసాక్షి) జులై 15 : నీళ్లు పోసి పరిశుభ్రంగా హరితహారం మొక్కలు పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్న కడవేరుగు గ్రామానికి చెందిన హరిత సైనికుడు ఆరుట్ల లింగం సేవలను తెలంగాణ రైతు సంఘం చేర్యాల మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి తెలుసుకుని మండల ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లగా వారిని కత్తుల భాస్కర్ రెడ్డి తో కలిసి చేర్యాల ఎంపీడీఓ సయ్యద్ అన్వర్ శుక్రవారం కార్యాలయంలో సైనికుడుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత పాటిస్తూ సక్రమంగా నిబద్ధతతో హరిత సైనికుడు చేస్తున్న సేవలను గుర్తించామని వారికి అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో కడవేరుగు గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area