కడుపునొప్పి తాళలేక పురుగుమందు సేవించి యువకుడు ఆత్మహత్య

టేకులపల్లి, సెప్టెంబర్ 30 (జనం సాక్షి): కడుపునొప్పి తాళలేక పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువకుడు కొత్తగూడెం వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన గురువారం అర్ధరాత్రి జరిగింది. టేకులపల్లి మండలంలోని తావూరియ తండ గ్రామానికి చెందిన బానోతు రాములు కుమారుడు బానోతు శివ(24) తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడని, గురువారం విపరీతంగా నొప్పి రావడంతో తట్టుకోలేక పురుగుమందు సేవించడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొత్తగూడెం వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. తండ్రి రాములు ఫిర్యాదు మేరకు శుక్రవారం టేకులపల్లి ఎస్సై భూక్య శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.