Thursday, 5 November 2026

కనీస వేతనాలతో టీచర్లను గౌరవించాలి

హైదరాబాద్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): విద్య ను పేదలతో పాటు ప్రజలకు అందించడంలో ప్రైవేటు పాఠశాలల కృషి మరువలేనిదని ప్రైవేట్‌ చీర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు షబ్బీర్‌ అన్నారు. అయితే తమకు కనీస వేతనాలు అందించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని అన్నారు. పాఠశాలల యజమానులు సామాజికి బాద్యతగా చేస్తున్న కృషిని అభినందించాలన్నారు. అయితే కొందరు చేస్తున్న అసత్యపు ప్రచారాలు మానుకోవాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవీ అందవని గ్రామాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ ప్రచారంతో అమాయక తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. ప్రభుత్వ అనుమతితో స్కూల్లను పెట్టి కష్టనష్టాలకు ఓర్చి విద్యను అందిస్తున్నామని అన్నారు. వివిధ ప్రైవేట్‌ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇవ్వాలని షబ్బీర్‌ అన్నారు. తక్కువ జీతాలతో ఎక్కువ పని చేస్తున్న ప్రైవేట్‌ టీచర్స్‌కు కనీస వేతనం ఇవ్వాలన్నారు. విద్యాహక్కు చట్టాన్ని ప్రతి ప్రైవేట్‌ పాఠశాలలో అమలు చేయాలని డిమాండ్‌చేశారు.