కనీస వేతనాలు చెల్లించండి.

చండ్రుగొండ జనంసాక్షి (ఆగస్ట్  26) : గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి  కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ  శుక్రవారం  చండ్రుగొండ పంచాయతీ కార్యాలయ సిబ్బంది  ఉప సర్పంచ్ బాబురావు,  కార్యదర్శి ఉపేందర్ లకు  వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా  వారు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో  ఇబ్బందులు పడుతున్నామని  పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా  కనీస వేతనాలు  10 వేల కు  పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో  గ్రామ పంచాయతీ కార్మికులు  సత్యం రాంబాబు  రామారావు లక్ష్మీ అంమనీ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు