రైతులకు పీఎం కిషాన్ రావాలంటే ఈకేవైసి తప్పనిసరి

-ఏఓ హరీష్ కుమార్
రామారెడ్డి   ఆగస్టు  26  జనంసాక్షీ :
రైతులకు పీఎం కిషాన్ రావాలంటే ఈకేవైసి తప్పనిసరని ఏఓ హరీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రామారెడ్డి మండల రైతులకు ముఖ్య సూచనలు పీఎం కిసాన్ స్కీమ్ కింద మీరు రూ. రెండు వేలు పొందుతున్నారా ! అయితే కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఈ నెల చివరిలోపు ఇకేవైసీ పూర్తి చేసుకొనివారు. ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి.  లేదంటే మీకు వచ్చే తర్వాతి  రైతు పెట్టుబడి డబ్బులు రాకపోవచ్చు. దింతో  మీరు వెంటనే ఇకేవైసీ పూర్తి చేసుకోండి. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ఐదు రోజులే మిగిలి ఉన్నాయి.  పీఎం కిసాన్ స్కీమ్ ప్రధానాంశాలు: అన్నదాతలకు ముఖ్యమైన అలర్ట్  పీఎం కిసాన్ రైతులకు గడువు దగ్గరకు వస్తోంది. ఇంకో ఐదు రోజులే మిగిలి ఉన్నాయి.  ఇలా చేయండి.. లేదంటే డబ్బులు పొందలేరు ఈ నెల చివరి వరకే గడువు ఉంది. అంటే ఐదు రోజులే మిగిలి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా అందిస్తున్న పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ. రెండు వేలు పొందే వారు ఇకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆగస్టు  31 వరకు గడువు ఉంది. ఈలోపు ఇకేవైసీ పూర్తి చేసుకుంటే ఇబ్బందులు ఉండదు. లేదంటే మాత్రం వచ్చే విడత పీఎం కిసాన్ రూ. రెండు వేల డబ్బులు పొందలేక పోవచ్చు. కేంద్రం ప్రభుత్వం మీ డబ్బులను అలాగే నిలిపివేసే అవకాశం ఉంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ ఈ డబ్బులు రావొచ్చు అందువల్ల రైతులు అందరూ ఇకేవైసీ పూర్తి చేసుకోండి. ఇప్పటికే ఇకేవైసీ పూర్తి చేసిన వారికి ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు ఇంకా ఇకేవైసీ పూర్తి చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోం డి. ఇప్పుడు ఈకేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలో తెలుసుకుందాం మీరు ముందుగా మీ ఫోన్‌లో క్రోమ్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఇప్పుడు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఇప్పుడు మీకు కుడి వైపున ఇకేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. తర్వాత మళ్లీ ఆధార్ అథంటికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్లీ మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. అంతా ఒకే అయితే అంటే అన్ని వివరాలు కరెక్ట్‌గా ఎంటర్ చేసి ఉంటే.. మీ ఇకేవైసీ పూర్తి అవుతుంది. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇన్‌వాలిడ్ అని వస్తుంది. అలాగే ఇప్పటికే మీరు ఇకేవైసీ పూర్తి చేసి ఉంటే.. కేవైసీ పూర్తి అయినట్లు చూపిస్తుంది. ఏమి తెలియకపోతే మీసేవ సెంటర్లలో చేసుకోండీ