కన్నకొడుకే కాలయముడై

హైదరాబాద్‌: శుక్రవారం మధ్యాహ్నం ప్రశాంత్‌నగర్‌ రోడ్‌ నెం.3లో కమలమ్మ (75)తో ఆమె కుమారుడు వినోద్‌ మద్యం మత్తులో గొడవపడ్డాడు. ఈ సమయంలో అతను ఆమెను ఇంట్లో ఉన్న మంచినీటి సంపులోకి తోసేశాడు. అనంతరం సమీప కాలనీలోని సోదరి ఇంటికి వెళ్లి తల్లిని చంపి సంపులో వేశానని చెప్పాడు. దీంతో ఆమె ఆందోళనతో తల్లి ఇంటికి వచ్చి చూడగా సంపులో తల్లి శవం కనిపించింది. తల్లిని చంపిన కొడుకు మద్యం మత్తులో నలుగురితోపాటు మృత దేహంపై పడి ఏడవటం గమనార్హం. విషయం తెలుసుకున్న మీర్‌పేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.